కావలసిన పదార్ధాలు :
మామిడికాయలు : 2
కారం : 3tbsp
ఉప్పు: రుచికి తగినంత
ఆవపిండి : 1tsp
మెంతిపిండి : 1/2tsp
నూనె: 1cup
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
తాలింపుకు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు
తయారు చేయు విధానం:
ముందుగా మామిడికాయను చెక్కుతీసి కడిగి తుడిచి వాలికలుగా ముక్కలు కొయ్యాలి. తర్వాత ఈ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి రెండు మూడు గంటలు ఉంచాలి. ఇప్పుడు ఊరిన రసంలో నుండి ముక్కలు వేరుచేసి ఎండలో పెట్టాలి. మంచి ఎండలో రెండు గంటలు ఉంచితే చాలు. ఈ మామిడి రసంలో కారం, ఆవపిండి, మెంతి పిండి, తగినంత ఉప్పు వేసి, చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. నూనె వేడి చేసి తాలింపు వేసి, చిదిమిన వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి, ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఎర్రగా నోరూరిస్తూ మాగాయపచ్చడి రెడీ. ఇష్టం ఉన్నవారు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: