ఆమె ఓ ఉన్నత పదవిలో ఉన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంకో ఏడాదిలో రిటైర్ కాబోతున్నారు. ఇంతలో ఆమెను చాలా దూరం ట్రాన్స్ ఫర్ చేశారు. మేఘాలయకు బదిలీ చేశారు. ఒక్క ఏడాదికి అంత దూరం వెళ్లలేను.. కాస్త పరిశీలించండి..అంటూ ఆమె కొలీజియానికి విజ్ఞప్తి చేసింది. కానీ వారు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోలేదు.


దీంతో కోపం నషాళానికి అంటింది.. అంతే..ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీ.కే తహిల్ రమణి రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమోదించారు. ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినిత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో కలత చెందిన జస్టిస్ తహిల్ రమణి తన బదిలీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని కొలీజియం తిరస్కరించింది. సెప్టెంబర్ 6న జస్టిస్ తహిల్ రమణి రాజీనామా చేశారు.


గతేడాది ఆగస్టులో జస్టిస్ తహిల్ రమణిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ ఏడాది ఆగస్టు 28న ఆమెను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేశారు. 2020 అక్టోబర్ లో జస్టిస్ తహిల్ రమణి పదవీ విరమణ చేయనున్నారు. మద్రాస్ చీఫ్ జస్టిస్ కూడా బదిలీ ఇష్టం లేక రాజీనామా చేయడం ఆసక్తిరేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: