కావాల్సిన ప‌దార్థాలు:
ఖర్జూరాలు- పావు కేజీ
పచ్చి కొబ్బరి- రెండు టీస్పూనులు
బాదం ప‌ప్పు- కొద్దిగా

 

పిస్తా ప‌ప్పు- కొద్దిగా
జీడిపప్పు- కొద్దిగా
వాల్ నట్స్- కొద్దిగా

 

తయారు విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్ నట్స్ వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు  అదే పాన్‌లో ఖర్జూరాలను వేయించాలి. అలా వేయిస్తూ ఉండే ఖర్చూరాలు కాస్త మెత్తగా అవుతాయి. వాటిపై కొబ్బరి త‌రుము చల్లి ఓసారి ఇటూ అటూ వేయించి దించేయాలి.

 

అవి చల్లారాక బ్లెండర్లో వేసి తిప్పాలి. అలాగే ముందుగా వేయించిన నట్స్ కూడా వేసి బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని… కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. వాటిని కొబ్బరి పొడిలో దొర్లించి తీస్తే స‌రిపోతుంది. అంతే ఆరోగ్య‌క‌ర‌మైన‌.. రుచిక‌ర‌మైన ఖర్జూరం ల‌డ్డు రెడీ.. వీటిని ఎంతో సులువుగా చేసుకోవ‌చ్చు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: