ఉదయం టిఫిన్ సమయంలో మనం తినే దోశలు ఏ వేరు.. ఎన్నో రకాల దోశలు ఇంట్లో చేస్తూ ఉంటారు.. ఉల్లిపాయ దోస, కారం దోస, ఎగ్ దోస, మాములు దోస.. ఇలా అన్ని రకాల దోసలు చేస్తుంటారు. అయితే అల అన్ని రకాల దోసలు మనం తిని ఉంటాం. కానీ కీరా దోస మాత్రం మనం తిని ఉండము. అయితే ఆ కీరా దోస ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి ఇంట్లోనే తయారు చేసేసుకోండి.. రుచిని ఆస్వాదించండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

బియ్యం - ఒక కప్పు, 

 

పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, 

 

కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు, 

 

జీలకర్ర - ఒక టీ స్పూను, 

 

పచ్చిమిర్చి - 3, 

 

అల్లం - అంగుళం ముక్క, 

 

ఉప్పు - రుచికి సరిపడా.

 

తయారీ విధానం... 

 

బియ్యాన్ని రెండు, మూడు గంటలు నానబెట్టి నీరంతా వడకట్టి, కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకొని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కనుంచి తర్వాత పెనంపై నూనె రాసి దోసెలుగా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి. అంతే కిర దోసె రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: