ఇప్పటి కాలంలో అమ్మకి, పిల్లలకి మధ్య దూరం రాను రాను మరి పెరిగిపోతుంది. హాస్టళ్లలో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు దీంతో తల్లీపిల్లల మధ్య  అగాధం పెరుగుతున్నది. ఉద్యోగినులైతే పిల్లల సంరక్షణకు బేబీకేర్ సెంటర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి.ఉద్వేగాలకు, ఉద్రేకాలకు లోనయ్యే టీనేజీ పిల్లల విషయంలోనైతే అమ్మకు కష్టాలే. అనుకరణలు శ్రుతిమించితే, అలవాట్లు అనర్థాలకు దారితీస్తే టీనేజీ పిల్లల వల్ల ఆమెకు అవస్థలే.

 

 

కాలంతో పరిగెడుతూ సాంకేతికత పేరుతో పిల్లలు ఎటువైపు మొగ్గుతున్నారో, ఏ అలవాట్లకు దగ్గరవుతున్నారో తెలుసుకోవాలంటే- అమ్మ కూడా ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నపుడే- పిల్లలకు ఏది ఎంతవరకూ అవసరమో అమ్మ నిర్ణయించగలదు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగంతోపాటు సాంకేతికతను, పరిసరాలను, మారే పరిస్థితులనూ ఆమె గమనించాల్సిందే. మరోవైపు ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరమవుతున్న పిల్లలు. ఆ తర్వాత పెళ్లిళ్లు, వేరు కాపురాలు ఇలా అన్ని దశల్లోనూ అమ్మకు వేదనే.. మానసిక, శారీరక సమస్యలతో ఆమెకు ఆవేదనే.మాతృమూర్తికి ఈ పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబానికే కాదు, సమాజానికీ సమస్యలే..

 

 

 పిల్లల చదువులు, వారి ఆరోగ్యం, వంటావార్పూతో ఊపిరి సలపని పని. ఉద్యోగం చేసే తల్లులకైతే సమయమే చాలదు. వారు కాలంతో పోటీపడుతూ పరుగెత్తాల్సిందే. ఇంతటి బిజీలో ఎంతటి సహనశీలికైనా ఒత్తిడి తప్పదు. తాను ఉద్యోగానికి వెళ్లినా- బడి నుంచి ఇంటికొచ్చే పిల్లలు ఏం చేస్తున్నారో అనే ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఎదిగే పిల్లల ప్రవర్తనలో, అలవాట్లలో మార్పుల వల్ల అమ్మకు మరిన్ని సమస్యలు.

 

ఇంటికి చేరుకున్నాక భర్త, పిల్లలు ఎవరి లోకంలో వారు మునిగిపోతుంటే అమ్మకు భరించలేని ఒంటరితనం.అమ్మ కష్టాన్ని అర్ధం చేసుకొని కుటుంబసభ్యులతో ఆమె పడే ఆవేదన అంతా ఇంత కాదు.. అమ్మ మన నుంచి ఏమి కోరుకోదు మనం ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలు పొంగిపోతుంది. అలాంటి అమ్మ బాధని, ఒత్తిడిని అర్ధం చెసుకుని అమ్మ మనసు నోచుకోకుండా మెలుగుదాం... !!

మరింత సమాచారం తెలుసుకోండి: