సుగంధ ద్రవ్యాలు, ఫెయిర్నెస్ క్రీమ్ అందాన్ని రెట్టింపు చేసే క్రీములు, ద్రవాలు ఇప్పుడు ఎవరికీ చెప్పను అవసరం లేకుండా బాగా ప్రాచుర్యం పొందినవి. జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమెరికాలోని మిన్నియాపోలీస్ సిటీ పోలీసుల చేతిలో నల్లజాతీయుడు  జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే.  నల్లజాతీయుడు హత్య తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి  ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి తన వంతు మద్దతుగా స్కిన్ వైట్నింగ్  క్రీమ్‌ ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్  ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు తెలిపింది. 

 

 

భారతదేశం సహా ఇతర  ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు  ఉండవని తెలిపింది.  అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు.

 


సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని,  ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం తమ ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది. 

 

 

మరోవైపు, జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న విషయం  తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: