చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలే పిల్లలు నోరు తెరిచి ఏ విషయాన్ని చెప్పలేరు. అలాగే పిల్లలకు నోట్లో వేలు పెట్టుకుని చీకే అలవాటు ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు  వయసు వచ్చాక  తన బొటనవేలు,  చూపుడువేలు మధ్య చిన్న చిన్న వస్తువులను మరింత సులభంగా కూడా పట్టుకోవచ్చు.అలాగే  నేలపైన ఉన్న వస్తువులను తీసుకొని, తన నోటిలో పెట్టుకోవచ్చు. అందుకనే నేలపై ఉన్న వస్తువులను  చెక్ చేసి, బుజ్జాయికి  ఎలాంటి హాని కలుగకుండా చూసుకోండి.మీరు చేస్తున్న ప్రతి పనిని అతను గమనిస్తూ ఉంటాడు. పిల్లవారు పెద్దవారిని, ప్రత్యేకంగా తల్లిదండ్రులను అనుకరించడం ఇష్టపడతారు. వారి ఇలాగే నేర్చుకుంటారు.పిల్లలు మీ మాటలను, మీ భాష శబ్దాలను కూడా అనుకరిస్తారు.



అలాగే మీ బాబుకి కొన్ని నెలలు నిండాక   దంతాలు వచ్చి ఉండవచ్చు. వాటిని సున్నితమైన పులకలతో ఉన్న ఒక చిన్న బ్రష్ తో, కొద్దిగా టూత్ పేస్ట్ వేసి శుభ్రంచేయండి.మీ ముద్దొచ్చే చిన్నారివైపు ఒకసారి చూడండి. ముత్యాలాంటి తెల్లని పళ్లతో బోసి నవ్వులు నవ్వుతు ఉంటాడు.అలాగే పిల్లలకు  ఒక శుభ్రమైన ఆట స్థలాన్ని అందించండి
నేల నుండి అలాగే  అపరిశుభ్రమైన నీటి నుండి, మీ బిడ్డ, క్రిములను గ్రహించవచ్చు. అవి పిల్లలకు హానికరమైన జబ్బలను కలుగజేయవచ్చు.మీ బిడ్డ పడుకునే ముందు, పాకే ముందు లేదా ఆడుకునే ముందు, నేలను సబ్బు, ఫ్లోర్ క్లీనర్ తో,  నీటితో శుభ్రపరచండి. దీనివలన మీ బిడ్డ  సురక్షితంగా ఉంటుంది. మీరు నేలను శుభ్రపరచలేకపోతే, ఒక పెద్ద, శుభ్రమైన షీట్ లేదా చాపను పరవండి.



మీ బిడ్డ  ఎదుగుతున్న కొద్దీ బయట ఆడుకోవడానికి ఇష్టపడవచ్చు, కానీ, కొన్ని ప్రదేశాలలో, క్రిములు ఒక సమస్యగా ఉంటాయి. క్రిములు, బురదనేలనుండి వచ్చి, కడుపునొప్పిని, దగ్గును, జ్వరాన్ని కలుగజేస్తాయి.అందుకనే మందమైన సాక్సులు, స్లిప్పర్స్ లేదా బూట్ల వలన పిల్లలు బయట నడుచునపుడు సంరక్షించబడతారు.ఎప్పుడు కూడా పిల్లల  చేతులను, సబ్బుతో, సురక్షితమైన నీటితో బాగా కడగండి. పిల్లల గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించడం కూడా ముఖ్యం. దీని వలన నేలనుండి క్రిముల గ్రుడ్లు, మీ బిడ్డ  తన చేతులను తన నోటిలో ఉంచుకున్నప్పుడు శరీరంలోని కి ప్రవేశించడానికి వీలుకాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: