మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం చాల అవసరం. ఈ సమయంలో ఏమి తినాలో, ఏమి తినకూడదో ఆలోచిస్తుంటారు. మీకు చాక్లెట్స్ తినడం అంటే ఇష్టమా.. అయితే మీకు ఒక శుభవార్త.. గర్భధారణ సమయంలో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి.చాక్లెట్స్ రెగ్యులర్ గా తినడం వల్ల ఫీటల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అంతే కాదు గర్భిణీ స్త్రీకి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. స్త్రీలు గర్భధారణ సమయంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలను డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చని నిర్ధారించారు.

అయితే డార్క్ చాక్లెట్ ను కోకోతో తయారుచేస్తారు. ఇందులో థియోబ్రొమైన్ కలిగి ఉండి ఇది రక్తప్రసరణను పెంచుతుంది. ఈ థియోబ్రోమైన్ కడుపులో పెరిగే శిశువుకు కూడా అవసరం అయ్యే రక్తప్రసరణను అందిస్తుంది. ఇతరులతో పోల్చినప్పుడు గర్భణీలు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. గర్భిణీ స్త్రీలు వారంలో 5 డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల గర్భిణీ స్త్రీ యొక్క గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఎదుర్కొంటుంది.

ఇక డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే కడుపులో పెరిగే శిశువు కూడా హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఐరన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉండి గర్భిణీలో హీమోగ్లోబిన్ కౌంట్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం ఫ్యాటీయాసిడ్స్ మెటబాలిజం రేటు పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లో షుగర్, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: