కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ చదువులకు మంచి క్రేజ్ వచ్చింది. స్కూల్ నుంచి పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారానే అన్ని రకాల క్లాసులను వింటున్నారు. మరోపక్క చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు. అయితే గతంలో పోటీ పరీక్షల కోసం అనేక కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు ఎక్కువగా క్యూ కట్టేవారు. కానీ.. యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల కోసం అనేక మంది యూట్యూబ్ చానళ్లను క్రియేట్ చేస్తూ వారు కూడా ఆర్థికంగా లాభపడుతున్నారు.

ఇలాంటి వారిలో కేరళకు చెందిన ఆశా బినీష్ ఒకరు. ఆమె వివిధ పోటీ పరీక్షలకు ఆన్ లైన్‌లో శిక్షణ అందిస్తూ యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కేవలం ఇద్దరు విద్యార్థులతో ఆమె ఆన్‌లైన్ కోచింగ్‌ను ప్రారంభించగా.. అది ప్రస్తుతం ఐదు వేల మంది విద్యార్థులకు శిక్షణ అందించే స్థాయికి ఎదిగింది. ఆశా బినీష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 2.5 లక్షలకు మించిన సబ్‌స్క్రై‌బర్లు ఉన్నారు. మరో విషయమేంటంటే.. ఆమె ఈ ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా ఏడాదికి కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. అసలు ఆశాకు ఈ ఆన్‌లైన్ కోచింగ్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే.. ఆశా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టాక ఉద్యోగాన్ని వదిలేసి.. ఇంట్లోనే వినూత్నంగా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఈ సమయంలోనే ఆమె ఈ కోచింగ్ క్లాసుల ఐడియా గురించి ఆలోచించి రెండు మూడు వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఆ తరువాత నెమ్మదిగా రెస్పాన్స్ పెరగడంతో మరిన్ని వీడియోలు చేయాలన్న ఆసక్తి పెరిగింది.  అలా ఆశా అక్కడి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది.
   

మరింత సమాచారం తెలుసుకోండి: