గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆహార పదార్దాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు తేనెని రోజు తీసుకోవడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక గ్లాసు వెచ్చని పాలతో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల గుండెల్లో మంట, విరేచనాలు వంటి అత్యంత సాధారణ సమస్యలను నివారించవచ్చుకోవచ్చు. ఇంకా ప్రశాంతంగా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అజీర్ణం, పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. సహజంగా లభించే తేనె గర్భిణీ స్త్రీల ప్రాధమిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అయితే గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తేనె సేవించడం ద్వారా అలెర్జీలకు దూరంగా ఉంటారు. ఇది గర్భధారణలో వచ్చే స్కిన్ అలర్జీలకు దూరంగా ఉంచుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ మితంగా తేనెను సేవిస్తే, శరీరంలో రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. ఇది కాలానుగుణంగా వచ్చే అలెర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది. సహజంగా వచ్చే నొప్పులన నివారించడంలో తేనె ఒకటి అని తెలుసుకోవాలి. గుండెలో మంట, అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. వీటి నివారణకు తేనె ఒక దివ్వఔషధం. తేనె నొప్పిని నివారించడానికి మరియు గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

ఇక గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ఏదో ఒక సమయంలో పొడి దగ్గుతో బాధపడవచ్చు. ఇలాంటి పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్ మందులు తీసుకోకూడదు. వీటి ప్రత్యామ్నాయంగా తేనె వంటి ఔషధాన్ని తీసుకోవచ్చు. దీన్ని సేవించడం వల్ల గర్భిణీలు జలుబు, దగ్గు, గొంతులో మంటను తేనె నివారిస్తుంది. మీరు తేనెకు అల్లం మరియు నిమ్మరసం కలిపి సేవిస్తే జలుబు శ్లేష్మ సమస్యల నుండి బయటపడతారు.

అంతేకాక గర్భధారణ సమయంలో నిద్ర లేమి సాధారణం. అటువంటప్పుడు, ఒక గ్లాసు పాలలో కొంచెం తేనెతో కలిపి తరచుగా సేవిస్తుంటే నిద్రలేమి సమస్య మాయమవుతాయి. ఇది నిద్రవేళకు కొద్దిసేపటి ముందు తీసుకోవాలి. అప్పుడే పిల్లలగా మంచి అందమైన నిద్రను పొందుతారు. గర్భధారణ సమయంలో గుండెల్లో మం, అజీర్ణం సమస్య సాధారణం. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో రోజూ ఒక గ్లాసు పాలకు కొంత తేనె కలిపి సేవించడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: