సంగీతం అంటే ప్రాణం గా బ్రతికే వారు చాలా మంది ఉన్నారు. సంగీతాన్ని చిన్నప్పటినుంచి ప్రేమిస్తూ నేర్చుకుని ఇప్పుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. సంగీత ప్రపంచంలో రాణిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించడమే కాకుండా వారికి తమ పాటల ద్వారా ఎంతో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. చిన్నతనంలోనే సంగీత రంగంలో ఎంతో ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు . అలాంటి వారిలో ఒకరు ఆర్య దయాళ్. దేశీయ సంగీతానికి వెస్ట్రన్ ఫ్లవర్ జోడించి యుకేలేలి తో అద్భుతాలు సృష్టిస్తోంది ఈమె. 

తాను పాడిన పాటను బిగ్ బి అమితాబ్ కు పంపించాలి అనుకుంది ఆర్య. అంతే అప్పటికప్పుడు తన గదిలో కూర్చుని ఎడ్ షిరన్ పాపులర్ సాంగ్ షేడ్ ఆఫ్ యూ పాడి సెల్ ఫోన్ లో రికార్డు చేసి పంపించింది. కోవేట్ చికిత్సలో భాగంగా ఆ సమయంలో బిగ్ బీ హాస్పిటల్ లో ఉండడంతో అక్కడి నుంచి స్పందన వస్తుందని అనుకోలేదు ఆర్య. కానీ ఊహించని విధంగా పెద్దాయన నుంచి పెద్ద స్పందన వచ్చింది. మీరెవరో నాకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు మీలో గొప్ప ప్రతిభ ఉందని. కర్ణాటక వెస్ట్రన్ మ్యూజిక్ ను మిక్స్ చేయడం సులువు కాదు.

కానీ ఆ పని మీరు చాలా సులువుగా చేశారు. మిక్సింగ్ లో వాటి సహజత్వం మిస్ కాకుండా చూశారు. ఈరోజు మీ పాట వినడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అని ట్విట్టర్లో ఆశీర్వదించారు బిగ్ బీ. హరిహరన్ లాంటి ప్రసిద్ధ గాయకుడి నుంచి కూడా ఆర్యకు ప్రశంసలు లభించాయి పెద్దల ప్రశంసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి అని సంబరపడిపోతుంది ఆర్య. కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన ఆర్య 2016 లో రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత సాహిత్యంలోనే కాదు సంగీతంలోనూ తన టాలెంట్ ను చాటుకుంది. కాలం మారి కోలం మారి అనే పాటతో డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: