సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ తగ్గుతుంది. అయితే 25 నుంచి 34 సంవత్సరాల వయసులో చూసుకుంటే 24 సంవత్సరాల వయసులో ఉన్న పునరుత్పత్తి సామర్థ్యంలో దాదాపు 10 శాతం వరకు తగ్గుతుందంట. ఇక ఒక సంవత్సర కాలం పాటు పిల్లల కోసం ప్రయత్నించిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సులో ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

అలాగే 30 ఏళ్ల వయసులో కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా.. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశం దాదాపు 20 శాతం ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. ఈ సమయంలో కూడా గర్భం దాల్చేందుకు అధిక అవకాశాలు ఉంటాయిని డాక్టర్లు తెలియజేశారు. ఇక ఏదైనా సమస్య ఉంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం అని చెబుతున్నారు.

ఇక పిల్లలను ఎప్పుడు కనాలనేది భార్యా, భర్తల సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే వారు పిల్లలను కనాలని నిర్ణయించుకున్నపుడు ఆ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ ఎలా పని చేస్తుందనేది ప్రధానం అని అన్నారు. కాగా.. యుక్త వయసులో ఉన్నపుడు స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుందని తెలిపారు. అందుకే.. అటువంటి సమయంలో గర్భం దాల్చడం చాలా సులభం అవుతుందని తెలిపారు. అయితే వయసు పెరిగే కొద్ది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ తగ్గిపోతుందని సూచించారు.

అంతేకాదు.. అటువంటి సమయంలో గర్భం దాల్చడం చాలా కష్టంగా మారుతుందని అన్నారు. కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్నపుడు 30–40 సంవత్సరాల వయసు ఉన్నప్పటితో పోల్చుకుంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా సులభమవుతుందని అన్నారు. అంతేకాక.. స్త్రీలల్లో అండాశయంలో ఏర్పడే అండాల వల్లే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుందని అన్నారు. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించే ముందు మనం అండాశయంలో అండాల విడుదల గురించి తప్పకుండా ఆలోచించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: