విచ్చలవిడిగా బ్రతికేయడంలో ప్రావిణ్యం ఉన్న పాశ్చాత్యుల నుండి భారతీయులు అన్ని నేర్చేసుకుంటున్నారు, కానీ వాళ్లలో ఉన్న ఐక్యత, క్రమశిక్షణ మాత్రం నేర్చుకోవాలని ఎవరికి అనిపించట్లేదు ఎందుకో..! ఏది ఏమైనా నేడు భారత్ లో జరిగే ప్రతి పండుగకు కూడా పాశ్చాత్య సంస్కృతిని అద్ది మరి దానిని ఆస్వాదిస్తున్నారు. ప్రాశ్చాత్యులేమో ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలంటే పడిచస్తున్నారు. నిజమేలే ఉన్నోడికి తిన్నది అరగక సమస్య, లేనోడికి ఆకలి అయినా తిండి దొరకక సమస్య. ఇది అలాంటిదే, ఒకరికి మంచి సంస్కృతీ సాంప్రదాయాలు ఉన్న చరిత్ర ఉంది, మరొకరికి ఆర్థికపరమైన చరిత్ర ఉంది. ఏదో ఒక్కటి పట్టుకోవాలని ఎవరు చెప్పారు. కానీ అందరూ చివరికి పాశ్చాత్యులు కూడా పొర్లు దండాలు పెట్టె స్థితి ఉన్న నీ సంస్కృతీ గొప్పదా లేక విచ్చలవిడిగా బ్రతికేస్తూ, ఎక్కడికో తమ ప్రయాణం తెలియక గాలికి తెగిన గాలిపటంలా ఉన్నవాళ్ళ సంస్కృతీ గొప్పదా అనేది ఆయా వ్యక్తులపై ఆధారపడుతుంది.

పాశ్చాత్యులు క్రమశిక్షణలో ఉత్తమంగా ఉంటారు, ఈ సంస్కృతిని పాటించే ఆయా దేశాలలో ప్రజలు తమకు విరుద్ధంగా ఏ నేత అయినా నిర్ణయాలు తీసుకుంటే తక్షణమే దానిని అమలు చేయరాదని రోడ్డెక్కి పోరాటాలు చేస్తారు. ఏమంటే తమ హక్కులకు భంగం అంటున్నారు. నిజమే కనీసం నీ  కూడా  పోరాటాలు చేయాలంటే దానికి ముందు నీ జీవనం విధానం ఎంత ఘోరంగా ఉందొ అని. తాజాగా అమెరికాలో  ప్రభుత్వం అబార్షన్ల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను మరింతగా కఠినతరం చేయాలని ఆదేశించింది. దీనితో అమెరికాలో గత నెలలో అనేక అబార్షన్లు చేయకుండా నిలిపివేశారు.

దీనితో దాదాపు పదివేలమంది మహిళలు రోడ్లెక్కి నిరసనలు ప్రారంభించారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అబార్షన్ చట్టాలు తమ హక్కులకు  కలిగిస్తున్నాయని వాళ్ళు వాదించారు. ఇది తమ హక్కు అని వాళ్ళు అంటున్నారు. అసలు క్షమాపణలు అనే అంశం కూడా లేకుండా అబార్షన్లు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా 660 చోట్ల జరిగినట్టు తెలుస్తుంది. మహిళలు ఇలా అడగటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: