గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి గర్భవతులు పొషకాలు ఎక్కువ గా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. సమయానికి ఆహారాన్ని తీసుకోవడం, సరిగ్గా నిద్ర పోవడం చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గా ఉంటుంది. అంతేకాదు తెలివిగా కూడా ఉంటారు. ఆరో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ తగు జాగ్రత్తలు పాటిస్తే బిడ్డ హెల్త్ బాగుంటుంది.ఏది తక్కువ అయిన కూడా మెదడు చురుగ్గా ఉండదు. శిశువు మెదడు చురుగ్గా పనిచేయడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుడ్లు, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు,పాల సంబంధిత వస్తువులను తీసుకోవడం చాలా మంచిది.పొలిక్ యాసిడ్స్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం..పాలు,పెరుగు తీసుకోవటం మంచిది.

గుడ్లు తీసుకోవటం వల్ల కోలిన్ అనే అమినో యాసిడ్ అధికంగా అందుతాయని నిపుణులు అంటున్నారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది.. జ్ఞాపక శక్తీ మెరుగుపడుతుంది.

చెరుకు..బిడ్డకు చక్కెర లోపం లేకుండా ఐరన్ ను అందిస్తుంది.మెదడు ఎదుగుదల కు కావలసిన పొషకాలు ఈ చెరకు లో ఉన్నాయి.

జింక్, మెగ్నిషియం, కాల్షియం ఎక్కువగా అందించె ఆహారపదార్థాలను తీసుకోవటం మేలు.పప్పు ధాన్యాలను, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.ఒమెగా 3 ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.చేపలను,సముద్రపు ఆహారాలను ఎక్కువ తినాలి.ప్రోటీన్‌ లు ఎక్కువగా ఉన్న అహారాన్ని తీసుకోవటం వల్ల బిడ్డ తెలివిగా పుడతారు.. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎముకలు, దంథాలు స్త్రాంగ్ గా ఉండాలంటే ఈ విటమిన్ అవసరం.గుడ్లు, చీజ్‌లు, ఆవు మాంసం మరియు కాలేయం వంటి వాటిని ఎక్కువగా తినాలి. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఎండలో వాక్ చేయాలి. ఇలా చేయడం వల్ల విటమిన్ డి అందడంతో పాటు నార్మల్ డెలివరీ అవ్వడానికి సులువుగా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం తో పాటుగా వైద్యుల సలహా తీసుకోవటం మంచిది.ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని సమంగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ తెలివిగా, చురుగ్గా పుడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: