కావలసిన పదార్థాలు: మటన్ : 250గ్రా. ఆలుగడ్డలు : 80గ్రా. ఉల్లిగడ్డలు : 2 బాస్మతీ రైస్ : 500గ్రా. ఇలాయిచీ పౌడర్ : 2గ్రా. షాజీరా :1గ్రా.  లవంగాలు : 1గ్రా.  దాల్చిన చెక్క పొడి : 1గ్రా. ఉప్పు : తగినంత కారం :1స్పూన్‌లు పచ్చిమిరపకాయలు : 10 కొత్తిమీర : ఒక కట్ట పుదీనా : ఒక కట్ట నెయ్యి : 10గ్రా. నూనె : 10గ్రా. పెరుగు : 25గ్రా. కాజు : 20గ్రా. నిమ్మరసం : 3 స్పూన్‌లు తయారు చేసే విధానం: ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేయాలి. ఉల్లిగడ్డలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్‌ని ఒక గిన్నెలో తీసుకొని అందులో సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క పొడి, ఇలాయిచీ పొడి, ఉప్పు, వేయించుకున్న ఉల్లిపాయలు, కారం, పచ్చిమిరపకాయల పేస్ట్, ఆలుగడ్డలు, పెరుగు, నూనె, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, నీళ్లను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యాన్ని సగం ఉడికించాలి. ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెను తీసుకొని కలిపి ఉంచిన మటన్‌ను అందులో వేయాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు సగం ఉడికిన బియ్యాన్ని వేసి గట్టిగా మూత పెట్టాలి. ఇలా తయారయైన అన్నాన్ని ఓ గిన్నెలో తీసుకొని పై నుంచి కాజు వేసి సర్వ్ చేయాలి. వేడి.. వేడి.. మటన్ లుకునీ నోరూరిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: