టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో అత్యాధునిక ip67 25.5 కిలోవాట్ల నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీ తో ఇది నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 24.93 కిలోమీటర్లు. ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేశాక 2 టన్నుల ట్రాలీ తో నడిపిన 8 గంటలపాటు బ్యాటరీ సామర్థ్యం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.. ఇకపోతే కేవలం నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జింగ్ కూడా అవుతుందని అంటున్నారు