ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు రోజుకో కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.రోజుకో కారు షికారు చేస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కార్లు సేల్స్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో వీటికి ధరలు భారీగా పెరిగిపోతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకు ఆ లగ్జరీ కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రీమియం, లగ్జరీ కార్ల ధరలు రూ.35 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పెరుగనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా థీమ్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం విదేశాల నుంచి వివిధ వస్తువుల విడి భాగాల దిగుమతులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు పెంచారు.