హోండా కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో ద్విచక్ర వాహనాలు మార్కెట్ లోకి వచ్చాయి.. ఇప్పుడు అంతకు మించి అన్న విధంగా ఉన్న ఫీచర్లతో మరో బైక్ మార్కెట్లో సందడి చేస్తోంది. హోండా సీబీ500ఎక్స్ లాంఛ్ చేశారు. ఈ బైక్ విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ ను అందుకుంది. కొత్త అడ్వెంచర్ ప్రీమియం మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ సీబీ500ఎక్స్ బైక్ ధర రూ.6.87 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే కస్టమర్ల నుంచి బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలిపింది. దేశంలోని తమ డీలర్ల వద్ద ఈ బైక్ లభ్యం అవుతుందని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా ఎండీ కం ప్రెసిడెంట్ అత్సుషి ఒగాటా తెలిపారు.