ఆడీ భారత్‌లో కొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారును సోమవారం విడుదల చేసింది. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్లో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరను రూ.79.06 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఎస్5 స్పోర్ట్ బ్యాక్‌ను 2017లోనే భారత్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిండచడంతో పాటు ఔటర్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కారు మరింత స్పోర్టీ లుక్‌ను సంతరించుకుంది. షార్పర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్లు అదనపు ఆకర్షణ. యాంగులర్ బంపర్, క్వాడ్ టిప్ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అలాయ్ వీల్స్, స్పాయిలర్‌తో పాటుగా కొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.