రాయల్ ఎన్ఫీల్డ్.. ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 4 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే మనదేశంలో అమ్మాయిల నుండి అబ్బాయిల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రాయల్ ఎన్ఫీల్డ్ నుండి మరో కొత్త బైక్ వస్తుంది. ఆ బైక్ చూస్తే వావ్ అనాల్సిందే. ఆలా ఉంది ఆ బైక్. అసలు ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా ? ఇంకేంటి అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 క్లాసిక్ 350 త్వరలోనే విడుదల కానుంది. 

 

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 క్లాసిక్ 350 బిఎస్ 6 వెర్షన్‌ను అతి త్వరలో దేశంలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్ లో ఇది ఒకటి. అయితే ఇటీవల పెరుగుతున్న పోటీ కారణంగా మార్కెట్లో అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో కొత్తగా విడుదల చేయనున్న బిఎస్ 6 బుల్లెట్ క్లాసిక్ 350 ను వల్ల కోల్పోయిన మార్కెట్ ఆధిపత్యాన్ని తిరిగి పొందవచ్చు అని కంపెనీ భావిస్తోంది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ తిరిగి మార్కెట్ ని ఈ బైక్ తో సొంతం చేసుకుంటుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: