భారతదేశంలో రోజురోజుకి కార్లో ఉపయోగం ఎక్కువైపోతోంది. నిజానికి మధ్య తరగతి చెందిన ప్రజలు కూడా చిన్న చిన్న అవసరాలకి కార్ల వైపు చూడటం ఎక్కువగా ఈ మధ్యలో చూస్తున్నాం. అంతేకాదు బ్యాంకులు కార్లపై లోన్ ఇవ్వడంతో మధ్యతరగతి కుటుంబాలు కూడా కారు కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే చాలామంది అందుబాటు ధరలతో పాటు మంచి మైలేజ్, మెరుగైన ఇంజన్ వంటి అనేక ఫీచర్స్ ను చూసి కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా అతి తక్కువ బడ్జెట్ కార్లకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ ను అనుసరించి ఆటో రంగ సంస్థలో ఎక్కువగా బడ్జెట్ లో దొరికే కార్లను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

IHG

ఇకపోతే తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయడానికి తక్కువ ధరకు దొరకడమే కాకుండా ఎక్కువ రోజులు పని చేసేలా కార్లు విడుదల అవుతున్నాయి. వీటిలో మారుతి సుజుకి, టాటా మొదలగు ఆటోమొబైల్ దిగ్గజం సంస్థలు కార్స్ ను ఐదు లక్షల కంటే తక్కువ అ ధరలలో కార్లని విడుదల చేస్తున్నాయి. 

IHG


ఇకపోతే ప్రస్తుతం మార్కెట్లో లభించే అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న కార్లు ఒకసారి చూద్దామా. మారుతి సుజుకి సంబంధించిన ఆల్టో కార్ మనకు 3 లక్షల నుంచి 4.4 లక్షల వరకూ వివిధ వేరియంట్స్ లో మనకు లభిస్తుంది. అలాగే తర్వాత రెనాల్ట్ క్విడ్. ఇక ఈ కారు కూడా మూడు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల 30 వేల మధ్యలో మనకు దొరుకుతుంది. ఆ తర్వాత హుండాయ్ శాంత్రో కారు చెప్పుకోవచ్చు. ఈ కారు మనకు నాలుగున్నర లక్షల నుంచి 6 లక్షల మధ్య లో వివిధ రేంజిలో మనకు లభిస్తుంది.. ఇదే కోవకు చెందిన కారు టాటా వారి టాటా టియాగో. ఇది కూడా నాలుగున్నర లక్షల నుంచి ఆరున్నర లక్షల మధ్యలో ఈ కార్లు దొరకను. ఇక చివరగా ఈ లిస్టులో చెప్పుకోదగిన కారు మారుతి సుజుకి వాగన్ ఆర్. ఈ కారు కూడా నాలుగున్నర లక్షల నుండి ఆరు లక్షల మధ్యలో వివిధ రేంజ్ లో దొరుకుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: