బ్రిటీష్ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ సరికొత్త మోడల్ ను తయారు చేసింది. దీనిని భారత మార్కెట్ లోకి విడుదల చేయడానికి ప్లాన్స్ వేస్తోంది. ట్రైయంప్ రాకెట్ 3జీటీ పేరిట రిలీజ్ అవుతున్న ఈ కొత్త మోడల్ బైక్ కు సంబంధించి ట్రైయంప్ సంస్థ ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ప్రత్యేక ఆకర్షణతో బైక్ రైడర్లకు ఆకర్షించే విధంగా సంస్థ ఈ బైక్ ను రూపొందించింది. కాగా, భారత మార్కెట్ లో సెప్టెంబర్ 10వ తేదీన ట్రైయంప్ రాకెట్ 3జీటీను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

భారత మార్కెట్ లో ట్రైయంప్ మోడల్ బైక్ ప్రత్యేక మోడల్ గా నిలవనుంది. ఈ బైక్ ఇండియన్ ప్రొడక్ట్ లైనప్ లో ఈ బ్రాండ్ మోడల్ లభ్యమవుతున్నట్లు సంస్థ పేర్కొంది. టైయంప్ రాకెట్ 3జీటీ మోడల్ బైక్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లు, ఫీచర్లు, పరికరాలను ఇండియా స్పెక్ మోడల్ లో కూడా కొనసాగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే బైక్ కి సంబంధించి అల్టిమేట్ మైల్ మంచర్ అండ్ టూరర్ గా ఉంటుందని ట్రైయంప్ సంస్థ పేర్కొంది.

ట్రైయంప్ రాకెట్ 3జీటీలో బైక్ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ ముఖ్యమైన ఫీచర్లను ఇందులో అమర్చింది. ఇందులో ప్రధానంగా రైడర్ కి అనువుగా డిజైన్ చేశారు. కంఫర్ట్ గా ఉండే హ్యాండిల్ బార్ ను ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి పిలియన్ రైడర్ సీట్లను పొందుపర్చారు. రాకెట్ 3జీటీలో రెండు దశల్లో హీటింగ్ సామర్థ్యాన్ని పొందుపర్చారు. దీని వల్ల బైక్ హిట్ ని బట్టి బైక్ వేగాన్ని పుంజుకుంటుంది. హీటెడ్ గ్రిప్స్, 20 ఇంచ్ స్పోక్డ్ అల్లాయ్ వీల్స్ లను ఏర్పాటు చేశారు. వేగంగా వెళ్లినా బైక్ అదుపు తప్పకుండా రోడ్డుపై పటిష్టతను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిలియన్ రైడర్ ఎత్తుకు సరిపడా బ్యాక్ రెస్ట్ ఫీచర్ ని కూడా ఏర్పరిచారు. దీని వల్ల ఎంత దూరం ప్రయాణించినా ఎలాంటి సమస్య తలెత్తదు.

బైక్ లో 2,458 సీపీ ఇన్ లైన్ త్రీ సామర్థ్యం కలిగిన సిలిండర్లను ఉపయోగించారు. 6000 ఆప్ పీఎమ్ వద్ద గరిష్టంగా 165 బీహెచ్ పీ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 4000 ఆర్ పీఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ వద్ద గరిష్టం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్- అసిస్ట్ క్లచ్, బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ తో సిక్స్ స్వీడ్ గేర్ బాక్సులను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: