కారు కొనాలని భావన చాలా మందికి ఉంటుంది.. కానీ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో కారుకు ఒక్కొ ప్రత్యేకత ఉంటుంది. కరోనా సెకండ్ ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పది లక్షల్లో కారును భావిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో ఒకసారి చూద్దాం.  


హోండా అమేజ్: 

హోండా కంపెనీకి చెందిన ఈ కారు రూ .6.19 లక్షలకు లభిస్తుంది. హోండా అమేజ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు గల రెండు ఇంజన్లను కలిగి ఉంది. మాన్యువల్ గేర్బాక్స్1.5- లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఈ కారు 100 పిఎస్ శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది


మారుతి సుజుకి విటారా బ్రెజ్జా: 


దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకికి కంపెనీకి చెందిన విటారా బ్రెజ్జా కారు రూ .7.34 లక్షలకే లభిస్తుంది. ఇటీవలే విటారా బ్రెజ్జా కొత్త BS-VI నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజన్- నుంచి పెట్రోల్ ఇంజన్కు మారింది. ఈ కారు1.5- లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇది 108 పిఎస్ శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టాస్క్ ను ఉత్పత్తి చేస్తుంది.


ఫోర్డ్ ఆస్పైర్: 

.
ఫోర్డ్ కంపెనీకి చెందిన ఈ కారు రూ .6.09 లక్షలకు లభిస్తుంది. ఫోర్డ్ ఆస్పైర్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. ఈ కారు 100 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. అంతేకాదు వీటికి పోటీగా మరి కొన్ని కార్లు ఉన్నాయి.. 

మహీంద్రా ఎక్స్యూవీ300: 


మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కారు రూ .7.94 లక్షలకు లభిస్తుంది. మహీంద్రా ఎక్స్యూవీ 500, మహీంద్రా ఎక్స్యూవీ 300 రెండూ దాదాపు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఈ కారు 116 పిఎస్ శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది...

కియా సోనెట్: 


ఈకియా కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ కారు రూ .6.71 లక్షలకు లభిస్తుంది. ఈ కారు అత్యధిక సంఖ్యలో ఇంజిన్-ట్రాన్స్మిషన్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది. దీనిలో టర్బో-పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 120 పిఎస్ శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్యును ఉత్పత్తి చేస్తుంది.. 


వీటితో పాటుగా వోక్స్ వ్యాగన్ పోలో,స్కోడా రాపిడ్ టిఎస్ఐ,మారుతి సుజుకి ఎర్టిగా మొదలగు కార్లు బడ్జెట్ కు తగ్గట్లే మార్కెట్ లో లభిస్తున్నాయి... అది కూడా పదిలక్షల లోపు వస్తాయి .. సామాన్యుడి కి ఇది శుభవార్తే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: