ఎంజి మోటార్ కంపెనీ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే చాలా మంచి ప్రజాదరణ పొందడం జరిగింది. ఇక కంపెనీ ఇప్పటికే ఎంజి హెక్టర్ ఇంకా ఎంజి గ్లోస్టర్ వంటివి లాంచ్ చేసి మంచి అమ్మకాలతో బాగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాహనాలలో కూడా మంచి అధునాత ఫీచర్స్ ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. కాబట్టి ఎంజి మోటార్ కంపెనీ ఈ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోంది.ఇక ఇందులో భాగంగానే ఎంజి మోటార్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ కార్ అయిన ఎంజి ఆస్టర్ ని కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు వినియోగదారులకు పరిచయం చేసింది.ఇండియాలో పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ఉన్న మొట్ట మొదటి కారు ఈ ఎంజి ఆస్టర్ ఎస్ యూవి అవుతుంది.

ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కొత్త కారు కంపెనీకి నాల్గవ మోడల్ అవుతుంది. ఇక అంతే కాకుండా ఈ కారులో జియో ఎల్ఓటి సొల్యూషన్ ద్వారా ప్రారంభించిన ఐటి సిస్టం కలిగి ఉన్న కంపెనీ మొదటి కారు కూడా ఈ సరి కొత్త ఎంజి ఆస్టర్ కారే.ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ లో ఇంకా రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంకా టెలిమాటిక్స్ కోసం ఈ-సిమ్ వంటి టెక్నాలజీని అందించడం జరిగింది. ఈ ఎస్‌యూవీ కార్ సాఫ్ట్‌వేర్ మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో సహా అనేక కొత్త సాంకేతికతలతో పరిచయం చేయబడింది.ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ లో పనోరమిక్ సన్‌రూఫ్ ఇంకా 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అలాగే ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా ఎయిర్ ప్యూరిఫైయర్ తో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉండటం అనేది విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: