రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility) అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ హాప్ మొబిలిటీ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తమ డీలర్‌షిప్‌లో కేవలం 150 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 225 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మినట్లు ఈ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి ఇండియన్ మార్కెట్లో హాప్ లియో (HOP LEO) ఇంకా హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మనకు అందుబాటులో ఉన్నాయి.ఈ డీలర్‌షిప్‌ను స్టార్ట్ చేసిన 150 రోజుల్లోనే అధిక సంఖ్యలో స్కూటర్లను అమ్మడం పట్ల కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయం హాప్ మొబిలిటీ ఉత్పత్తుల యొక్క అత్యుత్తమ నాణ్యత ఇంకా అలాగే ఎండ్-టు-ఎండ్ కస్టమర్ సర్వీస్ ఇంకా బలమైన మార్కెటింగ్ వ్యూహాలను ప్రతిబింబిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు పెట్రోల్ టూవీలర్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఈవీల వ్యాపారం బాగా జోరందుకుంది.ఇక ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో, హాప్ మొబిలిటీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకోవడం జరిగింది.



ఈ కంపెనీ నుండి స్టైలిష్ డిజైన్‌లతో కూడిన క్లాస్ ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో లభిస్తున్నాయి. కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలలో సరికొత్త సాంకేతికత ఇంకా అలాగే అత్యాధునిక ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇక అంతేకాకుండా, ఇవి నగర రోడ్లపై గొప్ప ప్రయాణ సౌకర్యాన్ని కూడా మనకు అందిస్తాయి.హాప్ హైదరాబాద్ డీలర్‌షిప్ సాధించిన ఈ విజయం గురించి హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ ఇంకా అలాగే సహ-వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ, ఈ విజయం హాప్ గ్రౌండ్ నెట్‌వర్క్‌కు చెందుతుందని, ఇది బ్రాండ్‌పై కస్టమర్ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని కస్టమర్‌లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమగ్రమైన మార్కెట్ పరిశోధనని చేస్తాని, ఇక తాము దానిని పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. డీలర్‌షిప్ ప్రారంభించిన కేవలం 150 పనిదినాల్లో 225 స్కూటర్‌లను అమ్మగలిగామని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: