జపాన్‌కు చెందిన టూ వీలర్ బైక్స్ తయారీ కంపెనీ యమహా, భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ ఎమ్‌టి-15 బైక్‌ను విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) బైక్ ధర వచ్చేసి రూ. 1,59,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని ముఖ్యమైన డిజైన్ అప్‌డేట్‌లు ఇంకా అలాగే మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇప్పుడు ఇది ఈ బ్రాండ్ MT సిరీస్ బైక్‌ల నుండి ప్రేరణ పొందిన కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా అలాగే బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.ఇక ఈ కొత్త 2022 yamaha mt-15 ఇప్పుడు సరికొత్త ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా అలాగే బాడీ గ్రాఫిక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇందులో కొత్తగా తేలికపాటి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్‌ను కూడా ఉపయోగించారు.ఇక ఈ సస్పెన్షన్ సెటప్ లో చేసిన మార్పుల కారణంగా, ఇది బైక్ లీనింగ్ ఇంకా అలాగే బ్రేకింగ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త మోడల్ తయారీలో యమహా డెల్టా బాక్స్ ఫ్రేమ్‌ను వాడారు.ఇక ముందు వైపు 37 మిమీ ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఇంకా అలాగే వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.



బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపున 282 మిమీ డిస్క్ బ్రేక్ అలాగే వెనుక వైపున 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇక ఇవి రెండూ కూడా సింగిల్-ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ని సపోర్ట్ చేస్తాయి.అలాగే డెల్టా బాక్స్ ఫ్రేమ్‌పై తయారు చేయబడిన కారణంగా, ఇది దాని విభాగంలోనే అత్యంత తేలికైన బైక్‌లలో ఒకటిగా ఉంటుంది. ఇక కొత్త 2022 MT-15  మొత్తం బరువు కేవలం 139 కిలోలు మాత్రమే ఉంటుంది.ఇక కంపెనీ ఈ బైక్‌కు ప్రత్యేకమైన ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్ ఇంకా అలాగే ఎల్ఈడి పొజిషన్ లైట్ లను జోడించింది. ఇంకా ఇందులో కొత్త ఎల్‌సిడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఆర్‌పిఎమ్ ఇంకా అలాగే స్పీడోమీటర్‌కు గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: