ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోతుంది. వీటి వినియోగం వల్ల దేశంలో పొల్యూషన్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఇక మీరు ఒక మంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలనుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు.మనం కోరుకునే అత్యాధునిక సౌకర్యాలు, అద్భుత ఫీచర్లు, అనువైన ధరలో ఒక బైక్ అందుబాటులోకి వచ్చింది.ఇక Okinawa Okhi90 పేరుతో ఈ బైక్ మన దేశంలో లాంచ్ అయ్యింది. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం ఏంటి? దీనిలోని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఈ బైక్ ధర ఎంత? అలాగే మైలేజీ ఎంత? అలాగే స్పెసిఫికేషన్లు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ముందుగా ఈ బైక్  ధర విషయానికి వస్తే.. ఈ బైక్ మన ఇండియాలో రూ. 1.21 లక్షలు ఉండే అవకాశం ఉంది. అయితే రాష్ట్రాల్లోని అన్నీ సబ్సీడీలు కనుక కలుపుకుంటే రేటులో మార్పు కనిపిస్తుంది. ఈ బైక్ మనకు గ్లోసీ వైన్ రెడ్, గ్లోసీ పెరల్ వైట్, గ్లోసీ యాష్ గ్రే, గ్లోసీ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.ఈ బైక్ 3800W పవర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఇందులో 72V, 50Ah లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. 


ఈ స్కూటర్ లో ఎకో ఇంకా స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్ లో ఇది 55 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. ఇక స్పోర్ట్స్ మోడ్ లో అయితే ఏకంగా 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.ఇంకా అంతేకాక కేవలం పది సెకన్లోనే 90 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే కెపాసిటీ వుంది. దీని బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే ఏకంగా 160 కిలోమీటర్లు వస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ గా చార్జ్ అవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే దీనికి 16-inch అల్లాయ్ వీల్స్ తో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ బ్రేక్స్ ఇంకా రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి.ఇక Okinawa Okhi90 బైక్ పూర్తి ఎల్ఈడీ లైటింగ్ తో వస్తుంది. లైట్ ని ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒక చార్జింగ్ పోర్ట్, బూట్ లైట్ ఇంకా కీ లేకుండానే ఆపరేట్ చేసేలా అప్డేటెడ్ సదుపాయం ఉంది. ఇంకా పూర్తి డిజిటలైజ్డ్ సెటప్ తో వినియోగదారులకు ఈ బైక్ అద్భుత అనుభూతిని అందిస్తుంది. మ్యూజిక్ కంట్రోల్, బ్యాటరీ చార్జ్ స్టేటస్, స్మార్ట్ ఫోన్ కనెక్టెవిటీ ఇంకా కాలర్ ఇన్ఫర్మేషన్ వంటివి స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇంకా అలాగే థెప్ట్ అలారమ్ కూడా ఈ బైక్ లో అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: