సీఎం జగన్ ఒక్కరోజులోనే కీలక కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించారు. అలాగే జిల్లాలకు పార్టీల అధ్యక్షులను ఖరారు చేశారు. వీరంతా జిల్లా స్థాయిలో పని చేస్తారు. వీరికి తోడు జగన్ ప్రత్యేకంగా రీజినల్‌ కో- ఆర్డినేటర్లును కూడా నియమించారు. వీరు ఎవరంటే.. చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.


అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉంటారు. వైఎ‍స్సార్‌, తిరుపతి జిల్లాలకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి వెంకటేశ్వరరావు ( నాని)ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.  ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు మర్రి రాజశేఖర్‌ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.



ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు  బొత్స సత్యనారాయణ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp