చైనాకు కరోనా మళ్లీ షాక్ ఇస్తోంది. తన పుట్టిళ్లు చైనాను కరోనా వదలట్లేదు. ఇప్పుడు మరోసారి అక్కడ కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం ఉద్ధృతికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ BA-5.2 కారణంగా సైంటిస్టులు చెబుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పలునగరాల్లో మళ్లీ కరోనా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. జియాన్, షాంఘై నగరాల్లో తాజాగా 300పైగా కొత్తకేసులు నమోదయ్యాయి.


ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న కఠిన లాక్ డౌన్ తరహాలో మరోసారి ఆంక్షలు విధించేందుకు చైనా రెడీ అవుతోంది. ఇప్పటికే కరోనా విజృంభణతో షాంఘై, బీజింగ్ నగరాల్లో మాస్  టెస్టింగ్ కు ఆదేశించారు. చెత్తను రీసైక్లింగ్ చేసే సిబ్బందిలో కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ నగరాల్లో  పబ్ లు, బార్లు, ఇంటర్నెట్ కేఫ్ లు నిలిపివేశారు. ఇప్పటికే జియాన్ ప్రజలు అర్ధరాత్రి వరకు నిర్ధరణ పరీక్షల కోసం లైన్లలో నిలబడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: