కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నానికి మరో సౌకర్యం సమకూరబోతోంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్న విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది. టిటిడి చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కడప, విజయవాడల్లో మాత్రమే ప్రభుత్వ డెంటల్ కాలేజీలు ఉన్నాయి. విశాఖలోనూ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఇప్పటికే కోరింది.


ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి విశాఖకు డెంటరల్ కాలేజీ రప్పిస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి డెంటల్ డిపార్ట్మెంట్ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. డెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో సిటీలోతో పాటు గ్రామీణంలో కూడా డెంటల్ ఆస్పత్రులు ఏర్పాటుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: