తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ, రేపు ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో యాగాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజ శ్యామల యాగం కోసం ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఈ యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు గణపతి పూజతో యాగాన్ని ఋత్వికులు మొదలు పెడతారు. 12 మంది రిత్వికుల ఆధ్వర్యంలో ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో జరగనున్న పూజ, యాగాలు నిర్వహిస్తారు. పుణ్యావాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండి పారాయణములు, మూల మంత్ర జపములు చేస్తారు.

రేపు నవ చండి హోమము, రాజశ్యామల హోమము.. ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం చేపడతారు. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో  ఈ యాగాలు జరగనున్నాయి. బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండటానికి దైవ కృప కోసం కేసీఆర్ ఈ యాగాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: