దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి.. వాటి నిర్వహణ బ్యాధతను అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కే అప్పగించిందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అంటున్నారు. కరోనా వేళ 15వేల మందికిపైగా న్యాయవాదులు, క్లర్కులకు 25 కోట్ల రూపాయలను సహాయంగా అందించామని మంత్రి తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

న్యాయవాదుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని.. ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి నేతృత్వంలో కౌన్సిల్ సభ్యులు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని క‌లిసి న్యాయ‌వాదుల సంక్షేమానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై విన‌తిప‌త్రం ఇచ్చారు. న్యాయ‌వాదుల సంక్షేమ నిధికి ఏటా 10 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాల‌ని బార్ కౌన్సిల్ ప్రతినిధులు కోరారు. న్యాయవాది మరణిస్తే నామినీకి సంక్షేమ నిధి నుంచి 4 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని.. ప్రభుత్వం త‌ర‌పున మరో 4 ల‌క్షల రూపాయలు  చెల్లించాల‌ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr