తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి  అమిత్‌ షాను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్  విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప‌ర్యట‌న‌లో భాగంగా జగన్ హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జ‌గ‌న్ మాట్లాడారు. ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని జగన్ గుర్తు చేశారు.


అలాగే ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించిందని.. తిరుపతిలోనూ నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సంస్థను ఏర్పాటు చేయాలని జగన్ కోరారు. దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్‌ రంగంలో సేవలందించే అటువంటి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను  కేంద్ర మంత్రి దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చారు. తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాకు జగన్ విన్నవించారు. వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: