కేసుల పెండెన్సీ తగ్గించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అంటున్నారు. కేసుల పరిష్కారం, పాలన అంశాల్లో న్యాయవాదులు, రిజిస్ట్రీ తోడ్పాటు కొనసాగాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్  ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కోర్టు సముదాయాల్లో సదుపాయాలు ఏకరీతిలో ఉండేలా... దేశంలోనే మొదటి సారి న్యాయ నిర్మాణ్ డాక్యుమెంటు రూపొందించినట్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు.


కోర్టుల భవనాల నిర్మాణానికి 5 నుంచి 20 ఎకరాలు కేటాయించినట్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్  తెలిపారు. హైదరాబాద్‌లో దేశంలోనే వినూత్నమైన సమీకృత ఫ్యామిలీ కోర్టుల సముదాయ నిర్మాణం దాదాపు పూర్తయిందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్  అన్నారు. రికార్డుల డిజిటీలకరణ కొనసాగుతోందన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్  సుదీర్ఘ కసరత్తు తర్వాత 36 మందికి సీనియర్ న్యాయవాదులుగా హోదాను హైకోర్టు కల్పించిందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్  తెలిపారు. అయితే కొందరిలో అసంతృప్తి ఉందని తెలుసనని... భవిష్యత్తులో వారి ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW