పేకాట విషయంలో కొందరు రాజకీయ పార్టీ నేతలు దొరికిన మాట వాస్తవమేనని.. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వారి విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని.. రాష్ట్ర ప్రభుత్వం పేకాట పై ఉక్కుపాదం మోపుతోందని.. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పురపాలికల్లో అవిశ్వాసాలకు సంబంధించి గందరగోళం ఉందన్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. చట్టసవరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాల్సి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని.. కార్మికులకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని.. తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయి, ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వస్తున్నారని.. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 13 రాష్టాల నుంచి కార్మిక నాయకులు తెలంగాణను సందర్శించి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. భాజపా జూటా పార్టీ, జూటా నేతలని.. రానున్న రోజుల్లో భారాస దేశంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక వచ్చేది కిసాన్, కార్మిక సర్కార్.. కార్మికులకు అండగా ఉండేది భారాస ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: