నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ మాస్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ ప్రాజెక్ట్ “అఖండ 2”  సినిమాపై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో తెలిసిందే . .. “అఖండ”తో బాక్సాఫీస్ వద్ద మైండ్‌బ్లోయింగ్ విజయాన్ని సాధించిన ఈ జంట మరోసారి కలవడంతో ప్రేక్షకులలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది . ..


ఇక బాలయ్య మార్క్ మాస్ యాక్షన్, బోయపాటి స్టైల్ ఎమోషనల్ డ్రామాతో మిళితమై అఖండ 2 కూడా పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రానుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది .. . అందుకే థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలై దుమ్ము రేపుతుందని డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అఖండ 2 - తాండ‌వం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జ‌రుపుకుంటోంది. మ‌రీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 13 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. . అలాగే నైజాం, సీడెడ్, గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా సాలిడ్ రేట్లకే బిజినెస్ ఫైనలైందని తెలుస్తోంది. .


ఈ భారీ బిజినెస్ ఫిగర్స్ చూస్తుంటే అఖండ 2పై ఉన్న అంచనాలు ఎంత స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. బాలకృష్ణ ఇమేజ్, బోయపాటి శ్రీను మాస్ హ్యాండ్లింగ్, థమన్ సంగీతం ఈ సినిమాకు మరో లెవెల్ హైప్ తీసుకొస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. 14 రీల్స్ ప్లస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు .. .


దసరా తర్వాత సంవత్సరాంతంలో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న చిత్రాల్లో అఖండ 2 ముందుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, బాలయ్య–బోయపాటి కాంబో మరోసారి బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: