టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన సెన్సేషనల్ సక్సెస్‌ఫుల్ సినిమాల‌లో ఒకటిగా నిలిచిన “మిరాయ్” ఇప్పుడు థియేటర్స్‌లో మాత్రమే కాకుండా త్వరలో ఓటిటీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ తర్వాత తేజ సజ్జ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.


మిరాయ్ థియేటర్స్‌లో విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు. తేజ సజ్జా యాక్షన్ సీన్స్, గౌర హరి అందించిన సంగీతం, అద్భుతమైన విజువల్స్ అన్నీ కలిపి మిరాయ్ సినిమాను ఒక వేరే స్థాయిలో నిలిపాయి.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సూపర్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మిరాయ్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫైనల్ అయ్యింది. మిరాయ్‌ డిజిటల్ హక్కులను జియో - హాట్‌స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇక ఈ ప్లాట్‌ఫాం వారు అధికారికంగా ప్రకటించిన ప్రకారం, మిరాయ్ చిత్రం అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమ్ కానున్నది. ఈ అప్‌డేట్‌తో థియేటర్స్‌లో మిస్ అయిన వారు, లేదా మరోసారి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు లభించడం గర్వకారణం. మొత్తానికి, “మిరాయ్” ఓటిటీలో కూడా హిట్ రేంజ్‌ని కొనసాగిస్తుందనే ఆశలు పెరిగాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: