ఏపీలో ఎలక్షన్‌ ఫీవర్‌ మొదలైంది. ఇప్పటికే టీడీపీ హామీలు గుప్పిస్తోంది. అందుకే సీఎం జగన్ కూడా కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తాజా కేబినెట్ స‌మావేశంలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ వర్తిస్తుంది. అలాగే కొత్త పించన్ విధానాన్ని మార్చి కొత్తగా జీపీఎస్‌ విధానం తెచ్చారు. అలాగే జిల్లా కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ ఆర్‌ ఏ పెంచారు. డీఏ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.


అలాగే గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్‌-1, 2 పోస్టులకు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం లభించింది. దీంతో పాటు ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు, విద్యా కానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: