అర స్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట దాన్ని పూతలా రాయండి. కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయండి. దీని వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు తగ్గుతాయి.