నేటి కాలంలో చాలా మంది బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో తెగ బాధ‌ప‌డుతుంటారు. వీటిని త‌గ్గించుకునేందుకు వేల‌కువేలు ఖ‌ర్చు చేస్తారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక హైరానా ప‌డుతుంటారు. వాస్త‌వానికి తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. ముక్కుపై వచ్చే ఈ నల్లటి మచ్చలను తొలగించినా.. పదే పదే వస్తూ విసిగిస్తుంటాయి. ఇవి అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా హాడలే. ఇది ముఖాలను అందవిహీనంగా చేయటమే కాదు.. కొన్ని సార్లు మానసికంగా కూడా క్రుంగదీస్తాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.. బ్లాక్ హెడ్స్‌కు సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి ఉప్పు బాగా స‌హాయ‌ప‌డుతుంది. ఇది బ్లాక్ హెడ్స్ ను నివారించడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఇందుకు ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య త‌గ్గుముఖం ప‌డుతుంది. అలాగే ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఉప్పు మరియు ఒక స్పూన్ పాలను బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పావు గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల చర్మంలోని బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

 

ఇక ఒక బౌల్‌లో టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని కొద్దిగా నీటిలో పేస్టులా కలుపుకోవాలి. ముఖాన్ని వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకొని తర్వాత.. బ్లాక్ హెడ్స్ ఉన్న చోట బేకింగ్ సోడా పేస్టును రాసుకోవాలి. కాసేపు ఆగాక రెండు నిమిషాలపాటు ముఖాన్ని మృదువుగా, వృత్తాకారంలో మర్దన చేసుకుని.. నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. అదేవిధంగా, ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పంచదార, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేసి పావు గంట‌ తర్వాత గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: