ఒక చిన్న గిన్నె అవిసె గింజలను తీసుకోని ఆ తరువాత ఒక కప్పు నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి బాగా వేడి చేయాలి.ఆ నీళ్లు వేడయ్యాక అవిసె గింజలను వేసి ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన 10 నిమిషాల తరువాత నీళ్లు కోడిగుడ్డు తెల్లసొన లాగా తెల్లగా జెల్ లాగా మారుతాయి. ఇలా జెల్ లాగా మారిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేయాలి. తరువాత ఒక పది నిమిషాల పాటు అలాగే కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కాటన్ గుడ్డని వేసి అందులో ఇలా ఉడికించిన అవిసె గింజలను వేసి చేత్తో గట్టిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఈ జెల్ అనేది గింజల నుండి సులభంగా వేరవుతుంది. ఇలా తయారు చేసుకున్న జెల్ ను ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకుని ఒక నెల దాకా ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న అవిసె గింజల జెల్ ను రోజూ రాత్రి పూట పడుకునే ముందు ముఖానికి రాసుకుని పొద్దున్నే చల్లటి నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి.


ఇలా చేయడం వల్ల చర్మం చాలా అందంగా అలాగే ఆరోగ్యవంతంగా తయారవుతుంది.మీ ముఖం ఖచ్చితంగా ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఈ జెల్ లో తేనెను కలిపి రాసుకోవడం వల్ల ముఖం పై ఉండే ముడతలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా అలాగే అంతేకాకుండా ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు ఇంకా నలుపుదనం వంటి వాటిని కూడా ఈ జెల్ చాలా ఈజీగా తొలగిస్తుంది. ఈ జెల్ ను ఎటువంటి చర్మతత్వం ఉన్న వారైనా కూడా వాడవచ్చు. ఇంకా అలాగే ఇతర ఫేస్ ప్యాక్ లల్లో కూడా ఈ జెల్ ను వేసి ముఖానికి కూడా రాసుకోవచ్చు. అలాగే ఈ జెల్ ను తీయగా మిగిలిన అవిసె గింజలను కూడా పేస్ట్ గా చేసి మీరు హెయిర్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా అవిసె గింజలతో చేసిన జెల్ ను వాడడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ముఖ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: