టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పేరు సంపాదించిందిన మెహరీన్ కౌర్ 2016లో కృష్ణగాడి వీరప్రేమగాధ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్,F2,F3 తదితర చిత్రాలలో నటించింది. గతంలో పెళ్లి విషయంలో ఎంగేజ్మెంట్ అయ్యి కూడా క్యాన్సిల్ అయింది.అప్పటినుంచి పెళ్లిపై ఏవో ఒక రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఫేక్ రూమర్స్ పైన దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది మెహరీన్. ముఖ్యంగా తనకు పరిచయం లేని XYZ వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు రావడం ఆ వార్తలు వైరల్ అవ్వడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురవుతున్నానని,నిరంతరం వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయం పైన మాట్లాడింది.


రెండేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈసారి ఈ వేధింపులు హద్దులు దాటాయని ఇప్పుడు నిజం చెప్పక తప్పడం లేదంటూ తెలిపింది.. ఈ పోస్టులో మెహరీన్ చాలా క్లారిటీగా ఒక విషయాన్ని అయితే తెలియజేసింది.. తాను ఇప్పటివరకు ఎవరిని వివాహం చేసుకోలేదని, భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా తన అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేస్తానంటూ హామీ ఇచ్చింది. ఒక నీచుడు నా వికీపీడియాని హ్యాక్ చేసి మరి రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది.


ఎవరు కూడా ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు, అలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఇక తనను జర్నలిస్టుగా చెప్పుకోకూడదని  ఘాటుగానే విమర్శలు చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి ఇలా ఎడిట్ చేయడానికి ఆపాలని, తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ చెక్ పెట్టింది. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా కొన్ని ఊహాగానాలు తన వ్యక్తిగత విషయం పైన తప్పుడు వార్తలు రాస్తూ కొన్ని ఎడిట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: