ప్రీతి జింటా 1998లో షారుఖ్ ఖాన్ చిత్రం 'దిల్ సే' తో సినీ కెరీర్‌ను ప్రారంభించింది (అందులో ఆమె చిన్న పాత్ర పోషించింది).ఆ తర్వాత 'క్యా కెహ్నా' చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.తెలుగులోనూ ఆమె మహేష్ బాబు సరసన 'రాజ కుమారుడు', వెంకటేష్ సరసన 'ప్రేమంటే ఇదేరా' వంటి చిత్రాలలో నటించారు.సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే, ఆమె 2016లో వివాహం చేసుకున్నారు.
వెండితెరపై తన నటనతో అలరించిన ప్రీతి జింటా, నిజ జీవితంలో 34 మంది బాలికలకు తల్లిగా మారి, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం అభినందనీయం. ఈ చర్య ఆమెకు అందంతో పాటు గొప్ప మనసు కూడా ఉందని నిరూపించింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి