అదేమిటంటే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ను ఎంచుకున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలోని పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ను సంప్రదించారని, కానీ చివరికి ప్రకాష్ రాజ్ ను తీసుకున్నట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ,ప్రకాష్ రాజ్ గతంలో విక్రమార్కుడు సినిమా సమయంలో కలిసి పని చేశారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు ప్రకాష్ రాజ్.
ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు. ఈమధ్య ప్రకాష్ రాజ్ సినిమాలలో కంటే ఇతర విషయాలలోనే ఈ నటుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రంలో కూడా కీలకపాత్ర పోషించడంతో ఈ పాత్రకి మంచి పేరు లభించింది. అలాగే హీరో విజయ్ దళపతి నటించిన జననాయగన్ వంటి చిత్రంలో కూడా నటించబోతున్నారు. ప్రకాష్ రాజ్ ఎక్కువగా పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలపైన స్పందిస్తున్నారు. మరి వారణాసి సినిమాలో వస్తున్న ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి