1. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ (పెద్ది)
కాంబో ప్రత్యేకత: గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా 'పెద్ది'. ఈ క్రేజీ కాంబో కోసం తెలుగు అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇది ఒక యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది.ఈ భారీ చిత్రం 2026 మార్చిలో థియేటర్లలో సందడి చేయనున్నట్లు సమాచారం.
2. రణబీర్ కపూర్ – సాయి పల్లవి (రామాయణం)
కాంబో ప్రత్యేకత: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సహజ నటి సాయి పల్లవి... ఈ అరుదైన, పవర్ ఫుల్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం 'రామాయణం'. రణబీర్ కపూర్ ఇందులో రాముడి పాత్రను, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ కూడా 2026లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
3. కార్తీక్ ఆర్యన్ – శ్రీలీల (తూ మేరీ జిందగీ హై)
కాంబో ప్రత్యేకత: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో యువతరంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల. 2026లో ఈ చిన్నది ఏకంగా రెండు సినిమాలతో సందడి చేయనుంది. అందులో ఒక కాంబో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్తో. ఈ హీరో సరసన ఆమె 'తూ మేరీ జిందగీ హై' అనే మూవీలో నటిస్తుంది. ఈ జోడీ తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
4. ఇబ్రహీం అలీ ఖాన్ – శ్రీలీల (దిలేర్)
కాంబో ప్రత్యేకత: శ్రీలీల 2026లో నటిస్తున్న మరో చిత్రం బాలీవుడ్‌కి చెందిన ఇబ్రహీం అలీ ఖాన్ సరసన. ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఆమె 'దిలేర్' అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటిస్తుంది. కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా 2026లో విడుదల కానుంది.
5. సిద్ధాంత్ చతుర్వేది – మృణాల్ ఠాకూర్ (దో దివానే షెహర్ మే)
కాంబో ప్రత్యేకత: బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధాంత్ చతుర్వేది, తెలుగులో 'సీతారామం'తో మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్. ఈ జంటను వెండితెరపై చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. వీరి కాంబోలో 'దో దివానే షెహర్ మే' అనే రొమాంటిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
2026లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ వంటి క్రేజీ కాంబోల నుంచి రణబీర్-సాయి పల్లవి వంటి వైవిధ్యమైన జోడీల వరకు థియేటర్లు సందడిగా మారబోతున్నాయి. అభిమానులు తమ ఫేవరెట్ జంటలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి