హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’ (2009) ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. సరికొత్త సాంకేతికతతో పండోరా గ్రహాన్ని, అక్కడి ప్రజలైన నా’వి’లను ప్రేక్షకులకు పరిచయం చేసిన కామెరూన్, ఆ సినిమాతో అద్భుతమైన అనుభూతిని అందించారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడమే కాకుండా, పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకుంది. తొలి భాగం విడుదలైన సుమారు 13 ఏళ్ల తర్వాత ‘అవతార్’ ఫ్రాంచైజీలో రెండో భాగం 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం తెచ్చిపెట్టిన అపారమైన హైప్ కారణంగా, రెండో భాగాన్ని చూసేందుకు సినీ ప్రేమికులు థియేటర్లకు పోటెత్తారు. అయినా చాలా మంది ప్రేక్షకులకు తొలి భాగం అందించినంత గొప్ప 'కిక్' లేదా వినూత్న అనుభూతిని ఈ సీక్వెల్ ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.


 'అవతార్ 3' బుకింగ్స్: హాట్ టాపిక్‌గా బుకింగ్స్ :
ఇప్పుడు జేమ్స్ కామెరూన్ ఈ ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, గతంలో తొలి రెండు భాగాల బుకింగ్స్‌కు కనిపించినంత క్రేజ్, జోష్ ఇప్పుడు ‘అవతార్ 3’ బుకింగ్స్‌లో కనిపించడం లేదనే చర్చ మొదలైంది. దీంతో, "అవతార్" ఫ్రాంచైజీపై ప్రేక్షకుల ఆసక్తి మరియు క్రేజ్ తగ్గిందా ? అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


కాగా, మేకర్స్ మాత్రం ఈ మూడో భాగం తొలి రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, అంచనాలను మించిపోయే కొత్త ఎలిమెంట్స్‌తో వస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మరి 'అవతార్ 3' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: