ఏపీ రాష్ట్రం విడిపోయి మొదటిసారి సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు.. 2014, 19 లో అమరావతి రాజధాని ప్రకటించడంతో భారీగా రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది. మొదట రాజధానిగా శివరామకృష్ణ కమిటీ దొనికొండ ప్రాంతాన్ని ప్రకటించడంతో ఆ ప్రాంతంలో ఒక్కటే భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రమంతా ఆ ధరల ప్రభావం కనిపించలేదు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నూజివీడు దగ్గర కొన్ని రోజులు, గుంటూరు, చిలకలూరిపేట మధ్యలో రాజధాని అంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగినప్పుడల్లా హైదరాబాదులో ఆస్తులు, పెట్టుబడులు పెట్టేవారు ఇతర ప్రాంతాలలో ఉన్న ఏపీ ప్రజలు అనేకమంది వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు.



కానీ ఇవన్నీ మారిపోయి అమరావతి వచ్చేసరికి.. అక్కడ కొనుగోలు చేయడానికి చాలామంది వెనుకడుగు వేశారు. ఎన్నారైలు వచ్చి అక్కడ భూములు కొనుగోలు చేయడమే కాకుండా కొంతమంది అప్పటి అధికార పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేయడంతో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. అక్కడ కోట్ల రూపాయలకు భూముల అమ్ముకున్న రైతులు ఇతర ప్రాంతాలలో (పల్నాడు, ప్రకాశం)  వెళ్లి భూములను కొన్నారు. అలా ఆ ప్రాంతాలలో కూడా భూములు ధరలు పెరిగాయి. ఇక్కడ మనీ రొటేషన్ జరిగి రియల్ ఎస్టేట్ బాగా జరిగింది.



2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానులని ప్రకటన తర్వాత, అమరావతి ప్రాంతంతో పాటుగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో భూము ధరలు పడిపోయాయి. విశాఖపట్నం ప్రాంతంలో మాత్రం భారీగానే ధరలు పెరిగిపోయాయి. అలాగే హైకోర్టు కర్నూలులో ప్రకటించడంతో కర్నూలులో కూడా భారీగానే ధరలు పెరిగాయి. కృష్ణ ,గుంటూరు, గోదావరి జిల్లాలలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. దీంతో మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకునే వారిలో రియల్ ఎస్టేట్ వారే ఎక్కువమంది ఉన్నారు.


ఇక 2024 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అమరావతితో సహా ఇతర ప్రాంతాలలో  రేట్లును పెద్ద ఎత్తున పెంచేశారు. సీఎంగా చంద్రబాబు రాబోతున్నారని సిగ్నలే భూముల ధరలు భారీగా పెరగడానికి కారణం. కానీ కొనుగోలు చేసేవారు మాత్రం కరువయ్యారు.  ఇప్పుడు అమరావతి చుట్టు ప్రాంతాలలో భూములు అపార్ట్మెంట్లు ఎవరు కొనలేదని.. దీనివల్ల భవన నిర్మాణకలు, కూలీలు , వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు. ఈ విషయంపై వైసీపీ తెలియజేస్తూ.రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ ఆదాయం,2023- 24లో ఏపీలో 22.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో కేవలం ఈ ఏడాది అక్టోబర్ నాటికి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం 13.92 లక్షలు జరిగాయని తెలుపుతున్నారు.


దీంతో మార్కెట్లో భూముల విలువ సగటున 50 శాతం వరకు పెంచిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారని, గత ప్రభుత్వ హయాంలో సంపద సృష్టిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించామని మెడికల్ కాలేజీలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జోరుగా ఇళ్ల నిర్మాణం, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు వంటివి  చేపట్టామని తెలియజేశారు. ఇప్పుడు అలాంటివేవీ కనిపించలేదని వైసిపి ప్రశ్నిస్తోంది. టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు కొనుగోలు కూడా తగ్గిపోయాయి, పెట్టుబడులు మొత్తం కూడా ఆ ప్రాజెక్టు మీదే పెట్టాము వడ్డీలు కట్టలేక పోతున్నాము అంటూ బిల్డర్స్ సైతం నోట్ ద్వారా లేఖలను వైరల్ చేస్తున్నారు. అయితే ఇదంతా మార్పు రావాలి అంటే జనం చేతిలో డబ్బులు రోటేషన్ అవుతేనే వ్యాపారస్తులు కూడా కొనుక్కోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: