మన చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం కోసం ప్రకృతిలో వివిధ రకాల పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి.మార్కెట్‌లో లభించే బ్యూటీ ఉత్పత్తులతో సరైన ఫలితాలు కలగకపోగా వాటి వల్ల అనేక దుష్పరిణామాలు కూడా ఎదురౌతుంటాయి.అందుకే ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు సాధ్యమైనంత వరకూ హోమ్ రెమిడీస్ మాత్రమే పాటిస్తే చాలా మంచిది.చందనం అనేది  అద్భుతమైన ఔషధం. చర్మం సంరక్షణలో చందనానికి మించింది లేదు. చర్మానికి కూలింగ్ అందించడంలో చందనం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ముఖాన్ని డీప్ క్లీన్ చేయడంలో సహాయపడుతుంది.ఇక ముఖ్యంగా వేసవిలో చందనం మిశ్రమం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మన ముఖ సౌందర్యం కోసం చందనం ఫేస్‌ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో చందనం రాయడం వల్ల ట్యానింగ్ సమస్య  తొలగడమే కాకుండా డెడ్ స్కిన్ కూడా పోతుంది.ఇంకా అంతేకాకుండా చందనం రాయడం వల్ల ఏజియింగ్ లక్షణాలు తగ్గిపోతాయి. ముఖంపై ఏర్పడే యాక్నే, పింపుల్స్ వంటి సమస్యలు ఈజీగా దూరమౌతాయి.ఇక ఇప్పుడు చందనం ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..


ఇక చందనం ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు 1-3 స్పూన్స్ రోజ్ వాటర్ అనేది అవసరమౌతుంది.అలాగే దీంతో పాటు విటమిన్ ఇ క్యాప్సూల్ 1, 3 స్పూన్స్ చందనం పౌడర్ కూడా కావాలి. చందనం ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నెని తీసుకోని ఇందులో దాదాపు 3 స్పూన్స్ చందనం పౌడర్ వేయాలి. ఆ తరువాత ఇందులో 1 విటమిన్ ఇ క్యాప్సూల్ ఓపెన్ చేసి వేయాలి. తరువాత ఇందులో 2-3 స్పూన్స్ రోజ్ వాటర్ వేస మూడింటినీ బాగా కలపాలి. అంతే  చందనం ఫేస్‌ప్యాక్ రెడీ అయిపోతుంది.చందనం ఫేస్‌ప్యాక్ రాసే ముందు ముఖాన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తరువాత చందనం ఫేస్‌ప్యాక్‌ను పూర్తిగా రాసుకోవాలి. ఆ తరువాత దాదాపు 20 నిమిషాలు అలానే ఉంచి..కాటన్, వాటర్ సహాయంతో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు రాస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. అలాగే వేసవి కాలంలో చందనం పౌడర్ చర్మానికి చలవ కల్గిస్తుంది. ముఖంపై ట్యానింగ్ సమస్యను ఈజీగా పోగొడుతుంది. చందనం ప్యాక్ సహాయంతో ముఖం క్లీన్సింగ్ ప్రక్రియకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: