జూన్ 23వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

  రట్టిహళ్లి నాగేంద్రరావు జననం : ప్రముఖ రంగస్థల నటుడు తొలితరం కన్నడ తెలుగు సినిమా నటుడు  అయిన రట్టిహళ్లి  నాగేంద్రరావు 1896 జూన్ 23వ తేదీన జన్మించారు. ఈయన  కన్నడ సినిమాలతో పాటు తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు.వైవీ రావు  నిర్మించిన తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచన ల్ల  ఎమ్వి సుబ్బయ్య నాయుడు తో పాటు నాగేంద్రబాబు కూడా నటించారు. ఈయన  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా భూకైలాస్, భక్త మార్కండేయ, నాగుల చవితి, ముగ్గురు కొడుకులు సంతోషం లాంటి సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించాడు. 

 

 నాదెండ్ల భాస్కర రావు జనం : కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23వ తేదీన జన్మించారు. 1984 లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు నాదెండ్ల భాస్కర్ రావు. ఈయన  1978 శాసనసభ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి సారి శాసనసభలో అడుగు పెట్టారు, 1978 నుంచి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఈయన కొనసాగారు. ఆయన మంత్రిగా కేబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్ సభకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు నాదెండ్ల భాస్కర్ రావు, అయితే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ లో మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు నాదెండ్ల భాస్కర్ రావు. 

 

 జాస్తి చలమేశ్వర్ జననం : సుప్రీంకోర్టు న్యాయమూర్తి.. కేరళ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ 1953 జూన్ 23వ తేదీన జన్మించారు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్నం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు 1976లో ఆంధ్ర ఉన్నత న్యాయస్థానంలో  న్యాయవాదిగా నమోధై  పలు పేరొందిన న్యాయవాదుల వద్ద పని చేశాడు. ఈ క్రమంలోనే పలు చట్టాలపై అనుభవాన్ని సంపాదించారు జాస్తి చలమేశ్వర్. 1988 నుంచి 89 వరకు ప్రభుత్వ హోంశాఖ న్యాయవాదిగా పనిచేశారు. 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు జాస్తి చలమేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన వారిలో ఈయన  కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: