కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ క్లస్టర్లో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నాయి.